
– బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు
– మాడవేడి వినోద్ కుమార్
నవతెలంగాణ- కంటేశ్వర్
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వెంటనే చేపట్టాలని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన బిసి ఉపాధ్యాయ సంఘం సమావేశం లో జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కు 7 సంవత్సరాలుగా పదోన్నతులు లేవని, 5 సంవత్సరాలుగా బదిలీలు లేక ఉపాధ్యాయుల కొరత తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ప్రభుత్వం కోర్టులో వేసిన కేసుల పరిష్కారానికి చొరవ తీసుకుని ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు చేపట్టాలన్నారు. బిసి ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని,కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన లో బిసి గణను చేపట్టాలన్నారు. 30/06/2023 తో రాష్ట్రంలో మొదటి పి ఆర్ సి గడువు ముగిసినందున, వెంటనే రెండవ పి ఆర్ సి కమీషన్ ఏర్పాటు చేయాలన్నారు.పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు.డిఎస్సీ 2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేస్తూ, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి ఆర్ గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ అధ్యక్షులు కొట్టూరు రమేష్, కోశాధికారి డి రాజు, ఉపాధ్యక్షులు మహేందర్, ఆర్మూర్ మండలం బిసిటియు అధ్యక్షులు రమేష్, డిచ్ పల్లి మండలం బిసిటియు అధ్యక్షులు కొట్టాల రామకృష్ణ, మాక్లూర్ మండల బిసిటియు అధ్యక్షులు గంగోనె సంజీవ్, గౌరవ సలహా దారులు రమణ స్వామి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.