– జల్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీకి గట్టి షాక్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట్
రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బడుగు బలహిన వర్గాల సంక్షేమం కోసం అనేక అభివద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్‌పల్లి పురపాల సంఘం బిజెపికి పట్టుకొమ్మలా ఉన్న జల్ పల్లి మాజీ సర్పంచ్ కట్టెల రాములు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారిని సాదరంగా ఆహ్వానించి కండువా కప్పి పార్టీ బలోపేతానికి మరింత కషి చేయాలని కోరారు. అనంతరం యువ నాయకులు పట్లోళ్ల కౌశిక్ రెడ్డి మర్యాదపూర్వగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కట్టెల రాములు మాట్లాడుతూ మంత్రివర్యులు ఆదేశాలు శిరసా వహిస్తూ పార్టీ బలోపేతానికి మరింత కషి చేస్తానని రాబోయే ఎన్నికల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం కోసం కషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్ పల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు సూరెడ్డి కష్ణారెడ్డి, పురపాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ జహంగీర్, .యంజాల జనార్ధన్ , మైనార్టీ అధ్యక్షులు శ్రీ. షేక్ అఫ్జల్, నాయకులు,సీనియర్ నాయకులు సయీద్ పటేల్, సజీబ్ పటేల్, 16వ వార్డు అధ్యక్షులు పోలిముని నాగేష్ ముదిరాజ్, యువ నాయకులు యంజాల అర్జున్ సీనియర్ నాయకులు సూరెడ్డి గోపాల్ రెడ్డి , సత్తిరెడ్డి నాగేందర్ రెడ్డి, మైనార్టీ ఉపాధ్యక్షులు . ఎండి సాదిక్, నరసింహ , దూడల అనూష్ గౌడ్, దానయ్య ,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.