సమస్యలపై సీపీఐ(ఎం) పాదయాత్ర

– సమస్యలపై సీపీఐ(ఎం) పాదయాత్ర
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌
నవతెలంగాణ-సంతోష్‌నగర్‌ / ధూల్‌పేట్‌
సీపీఐ(ఎం) జంగంమెట్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్‌లోని శివగంగానగర్‌, రాజనాబౌలి, లక్ష్మీ నగర్‌, శివాజీ నగర్‌ తదితర బస్తీలలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌ పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ రాజన్నబౌలి నాలా వల్ల చాలామంది ప్రజలు ఆ దుర్వాసన వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలా పనులు సగం రోడ్డు వరకు చేసి మధ్యలో వదిలేసిన పరిస్థితి ఉందని, దీనివల్ల వర్షాకాలం వస్తే ఆ ప్రాంతంలో ఉన్న కానీలలో ఇండ్లలో మురుగునీరు, వర్షపు నీరు మోకాళ్ళ ఎత్తున వచ్చి ప్రజలు నానా తంటాలు పడుతూ అనారోగ్యాల బారినపడు తున్న పరిస్థితి ఉందన్నారు. జీహెచ్‌ఎంసి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం వెంటనే నాలా పూర్తిగా నిర్మించి, దానిపై రోడ్డు వేయాలని వారు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నాలా ప్రభావ ప్రాంతంలో ఉన్న ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. వెంటనే పనులు ప్రారంభం అయ్యేటట్టు చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కష్ణ, కిషన్‌, రామ్‌ కుమార్‌, శీను, నవీన్‌, నరేందర్‌, శివమణి తదితరులు పాల్గొన్నారు.