33వ వార్డులో బిఆర్ఎస్వి నూతన కమిటీ ఏర్పాటు

నవతెలంగాణ – సిద్దిపేట
33వ వార్డులో మంత్రి హరిశ్ రావు ఆదేశాల మేరకు కౌన్సిలర్ తస్లీమ్ బేగమ్- అబ్దుల్ మొయిజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి వార్డ్ నూతన కమిటీ వేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, పట్టణ బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ మహిపాల్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాల విషయం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.  హరీశ్ రావు యువతి, యువకుల కొరకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం ప్రారంభించరని, ఈ సదావకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  కౌన్సిలర్ తస్లీమ్ బేగమ్-అబ్దుల్ మొయిజ్ లు నూతన విద్యార్థి విభాగం అధ్యక్షుడు షేక్ అద్నాన్ ను, కమిటీని అభినందించారు. ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశాన్ని యువతకి కల్పించినందుకు 33వ వార్డు యువతి, యువకుల తరఫున ప్రత్యేక ధన్యవాదములు మంత్రికి తెలిపారు. పట్టణ ఉపాధ్యక్షుడు రాము, వార్డ్ ప్రెసిడెంట్ ఇబదుల్లాహ్ ఖురేషి, టౌన్ బిసి కో ఆర్డినేటర్ ముదిగొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు గోరేమియా, జాకిర్, సమీర్, ఖయ్యుమ్ పాషా, షాహెద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.