దంపతుల ఆవేదన సభకు భారీగా తరలిన జిల్లా ఉపాద్యాయ దంపతులు

నవతెలంగాణ – సిద్దిపేట
రాష్ట్ర స్పౌజ్ ఫోరమ్ ఆధ్వర్యంలో విద్యా శాఖలో నిలుపుదల లో ఉన్న  ఉపాద్యాయ దంపతుల  బదిలీలు జరపాల్సిందిగా కోరుతూ దంపతుల ఆవేదన సభకు భారీగా  జిల్లా ఉపాద్యాయ దంపతులు తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బదిలీలు జరుపులో ప్రభుత్వ అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దంపతుల ఆవేదన సభకు జిల్లా నుండి జిల్లా ఫోరమ్ బాద్యుల అధ్వర్యంలో బాధిత ఉపాధ్యాయ దంపతులం  పెద్ద ఎత్తున రెండు బస్సులలో బయలు దేరి వెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు కృష్ణ, బాలస్వామి, ప్రవీణ్, మహేష్, మల్లికార్జున్, నాగరాజు, మమత, సంతోషి, రేణుక,  లతో పాటు సుమారు 60 కి పైగా ఉపాద్యాయ దంపతులు ఉన్నారు.