
– దాచారం గ్రామ పంచాయతీలో రికార్డుల తనిఖీలు
నవతెలంగాణ -బెజ్జంకి
ప్రభుత్వాల ద్వార ప్రజలకు పారదర్శక పరిపాలన అందించడం కోసమే కౌన్సిల్ ఫర్ సీటీజన్ రైట్స్(సీసీఆర్) కృషి చేస్తుందని సీసీఆర్ జిల్లాధ్యక్షుడు గుండ్ల శివచంద్రం అన్నారు.మంగళవారం మండల పరిధిలోని దాచారం గ్రామ పంచాయతీ కార్యలయంలో ఉదయం నుండి రాత్రి వరకు పంచాయతీ రికార్డులను సీసీఆర్ జిల్లాధ్యక్షుడు శిలీంధ్రం, కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. బుధవారం శిశచంద్రం విలేకరులతో మాట్లాడారు. అవినీతి రహిత సమాజ నిర్మాణమే సీసీఆర్ ప్రధాన లక్ష్యమన్నారు.ప్రభుత్వాలు పారదర్శక పరిపాలన అందించాలనే సదుద్దేశంతోనే పంచాయతీ రికార్డుల తనిఖీలు నిర్వహించామని..రికార్డుల తనిఖీలకు గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, అధికారులు సహకరిచడం ఆనందనీయమన్నారు. రికార్డుల్లో అవకతవకలు జరిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నివేదిస్తామన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవశ్యకత చాల ఉందని సూచించారు. ఎక్కడైనా అవినీతి జరుగుతుందని దృష్టికి వస్తే ప్రజలు సీసీఆర్ 9949120690 సంప్రదించాలని తెలిపారు. రాష్ట్ర మీడియా కో ఆర్డినెటర్ సాజిద్, జిల్లా మీడియా కో ఆర్డినెటర్ ఇలియాస్, సభ్యులు భాస్కర్, ఎర్ర బాలరాజు తదితరులు పాల్గొన్నారు.