– తెరిచి చూసి నివ్వరపోయిన వినియోగదారుడు
– ప్యాకెట్ పాలు వాడుతున్నారా.. జరభద్రం…!
నవతెలంగాణ-నాచారం
మేడి పండు చూడు మేలుమైయుండును.. పొట్ట విప్పి చూడు పురుగులుండు అని మనం చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నాం…! నేడు పాల ప్యాకెట్లు విప్పి చూస్తే బొద్దింకలు దర్శనమిస్తున్నాయి. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్‌నగర్ కు చెందిన అసిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి కుమారుడు నోమ కల్యాణ వేదిక వద్ద గల సూర్యాపేట విజయ డైరీకి చెందిన పాల బూత్‌లో విజయ పాల ప్యాకెట్ కొన్నాడు. ఇంటికి వెళ్లి తెరిచి చూడగా అందులో నల్లని రంగులో ఉన్న బొద్దింక దర్శనం ఇవ్వడంతో నివ్వరు పోయిన కుటుంబ సభ్యులు వెంటనే విజయ డైరీ బూత్ వద్దకు వచ్చి చూపించారు. విక్రియదారుడు కంగుతిని తన దగ్గరే తీసుకువెళ్లారు కానీ తాను తయారు చేసిన పాల ప్యాకెట్ కాదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. చూడకుండా ఆ పాలను వేడి చేసి తాగి ఉంటే పరిస్థితి ఏమిటని పాల బూత్ నిర్వాహకునిపై విక్రియదారుడు ప్రశ్నించాడు. తనకు ఈ ఘటనపై విజయ డైరీ పాల తయారీదారుల నుంచి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతానని కొనుగోలుదారుడు తేల్చి చెప్పడంతో పాల బూత్ వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొంత ఆందోళనకు చెందిన పాలబూత్ యజమాని వెంటనే విజయ డైరీ ఆల్వాల్ బ్రాంచ్ మేనేజర్ కు సమాచారం అందించాడు. పాలలో ఉన్నది బొద్దింకనా.. లేక ఇంకా ఏమైనా అనే విషయంపై పరీక్షలు నిర్వహించి పాల ప్యాకెట్ విక్రియదారునికి స్పష్టత ఇస్తామని హామీ ఇవ్వడంతో విషయం సద్దుమనిగింది.
ప్రస్తుతం మార్కెట్‌లో మనిషి తినే ప్రతీ వస్తువు కల్తీ అవుతోందనేది ఎంత సత్యమో పాల ప్యాకెట్ ఉదాంతమే అందుకు నిదర్శనం. ప్రజలారా..! మనం వినియోగించే ప్రతీ వస్తువు నకిలీ, కల్తీ ఉంటుందని అనేక పరిశోధనా సంస్థలు ఎప్పుడో వెల్లడించాయి. అయినా ఉత్పత్తిదారులు అత్యాశ, ఆర్థిక ప్రయో జనమే తప్ప ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా మాకెందుకు అంటూ బరితెగించి మార్కెట్లో ప్రతి వస్తువు నకిలీ, కల్తీలుగా విక్రయిస్తున్నారని తెలుస్తోంది. నియంత్రించవలసిన శాఖ అధికారులు అవినీతి ,నిద్రావస్థలో నిమగమైనారు కాబట్టే విచ్చలవిడిగా నకిలీ, కల్తీలు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ప్రజా ఆరోగ్యం పై దష్టి పెట్టి నకిలీ, కల్తీలను నియంత్రిస్తే వినియోగదారుల ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుందని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.