న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

టీపీసీసీ సభ్యులు మర్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-మంచాల
గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల న్యాయ మైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని టీపీసీసీ సభ్యులు, ఇబ్రహీం పట్నం నియోజకవర్గ నాయకులు మర్రి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనంత తక్కువ వేతనం జీపీ కార్మికులకు ఇస్తు న్నారనీ, పని భారం మాత్రం అధికంగా పెంచు తున్నారని అన్నారు. 51 జీఓను అమలు చేస్తూ మల్టీపర్పస్‌ విధానంలో భాగంగా అనేక పనులు చేయిస్తున్నారని, కొన్ని పనుల్లో వారికి అవగాహన లేకపోయినా పనుల చేయడంతో చాలా మంది కార్మికులు ట్రాక్టర్‌ బోల్తా పడి, విద్యుషాక్‌కు గురై మృతి చెందిన వారు అనేక మంది ఉన్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా గ్రామాల్లో పారిశుధ్య పనులు నిర్వహించారని గుర్తు చేశారు. ఈ విపత్కకాలంలో తనవంతుగా గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులకు నిత్యవసర సరుకులు, శాని టైజర్స్‌ ,మాస్కులు ,ఆర్థిక సహాయం కూడా అదించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ, ఉద్యోగ కార్మికుల న్యాయమైన డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ పోచమోనీ కృష్ణ, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఖాజా పాషా, దూసరి భాస్కర్‌, ఎంపీటీసీ అంబోత రాందాస్‌, కాంగ్రెస్‌ నాయకులు పాతులోత శ్రీనివాస్‌నాయక్‌, పందుగుల లింగం గౌడ్‌, టేకుల కమలాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ నాయక్‌, చరణ్‌ ముదిరాజ్‌, గోవర్థన్‌రెడ్డి, ధనరాజ్‌, కృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు.