ఉపాధి శిక్షణా తరగతులకు దరఖాస్తులు ఆహ్వానం

సంస్థ సంచాలకులు కె. రమేశ్‌
నవతెలంగాణ-మొయినాబాద్‌
ఉచిత ఉపాధి శిక్షణా తరగతులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సంస్థ సంచాలకులు కె. రమేశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారున. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చిలుకూరు ప్రాంగణంలో జూలై 3వ తేదీన ప్రారంభమయ్యే నూతన బ్రాంచ్‌కు జూన్‌ 24వ తేదీ నుంచి జూలై రెండోవ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. పురుషులకు బైక్‌ మెకానిక్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, సీసీ టీవీ కెమెరా సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ, హాస్టల్‌ భోజన వసతి కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు ఉండలనీ, 19 నుంచి 45 ఏండ్లలోపు ఉన్న వారై ఉండలని సూచించారు. శిక్షణా కాలం 30 రోజుల కాల పరిమితి ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలు సంప్రదించేందుకు ఫోన్‌ 8639079122, 7981951167,9000778300 లకు ఉదయం10 నుంచి సాయంత్రం 05 గంటల వరకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

Spread the love