– మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్
నవతెలంగాణ-బడంగ్‌పేట్
బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్ అభివద్ధికి తన వంతు కషి చేస్తున్నానని మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి,డిప్యూటీ మేయర్ ఇబ్రం శేఖర్‌లు అన్నారు. సోమవారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 27వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డితో కలిసి సీసీ రోడ్డు నిర్మాణ పనులను బడంగ్‌పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా మున్సిపల్ కార్పోరేషన్ లోని 5వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డిలతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పేద ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాలనీల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.