నవతెలంగాణ-కాప్రా
ప్రొ ఫ్యాషన్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ వారు ఎస్సీ కార్పొరేషన్ టీఎస్సీసీడీసీ లిమిటెడ్ సహకారంతో 3 నెలలుగా కాప్రాలోని గాంధీనగర్ లో 35 ఎస్సీ మహి ళలకు అడ్వాన్స్ టైలరింగ్, మగ్గం ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇచ్చి, శిక్షణ అనంతరం సూయింగ్ మిషన్స్, సర్టిఫికెట్స్ కూడా ప్రధానం చేశారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బండారి లక్ష్మారెడ్డి లబ్దిదారులు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ తిలకించి మూడు నెలలలో ఇంతటి నైపుణ్యాన్ని అందజేసి ఉచితంగా కుట్టుమిషన్లు కూడా ఇస్తున్నందుకు ఎస్సీ కార్పొ రషన్ సంస్థను, ప్రొఫెషన్ డైరెక్టర్ ధీరం ఉషాని ఆయన అభినందించారు. ఇలాంటి పథకాలను మరింత సద్విని యోగం చేసుకోవాని లబ్దిదారులను కోరారు. అభయ ఎన్జీవో వారికి బ్యూటిషన్ కోర్స్ కూడా మహిళలకు అందు బాటులోకి తీసుకొని రమ్మని దానికి వారు సహకారం అందజేస్తామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ మేడ్చల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోగానంద మాట్లాడు తూ ఈ పథకంలో 100 పైగా కోర్సెస్ ఉన్నాయనీ, వీటిని మహిళలు పురుషులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణ పార్టీ సీనియర్ లీడర్ అనుమూల నరసింహారెడ్డి ఉమెన్ ఎంపవర్మెంట్ పై కృషి చేస్తున్న ప్రొఫెషన్ టీంని అభినందిస్తూ సపోర్ట్ చేసిన గాంధీనగర్ అసోసియేషన్ వారిని అభినందించారు. స్వయం ఉపాధి పథకాలను మరింత అందుబాటులోకి తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందు ట్రైనర్స్ పద్మావతి, తస్లీ మ్, కో-ఆర్డినేటర్ సుచిత్ర రెడ్డి, ప్రాజెక్ట్ ఇన్చార్జి షకీలా, గాంధీనగర్ కాలనీ సభ్యులు జి.ఇంద్రయ్య, జి.నర్సింగ్ రావు, జి.కృష్ణయ్య, డి.బాబురావు పాల్గొన్నారు.