పర్వతారోహణ చేసి భారత, టీఎన్జీఎస్‌ యూనియన్‌ పతాకాలు ఆవిష్కరణ

నవతెలంగాణ-సిటీబ్యూరో
డీపీఆర్‌ఓ, ఐఅండ్‌పిఆర్‌ డిపార్ట్మెంట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వేముల నితిన్‌ టీఎన్‌జీఓస్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు హుస్సేని (ముజీబ్‌) ప్రోత్సా హంతో సౌత్‌ అమెరికా, అర్జెంటీనాలో పర్వతారోహణ చేసి భారతీయ జాతీయ పతాకం, టీఎన్జీఎస్‌ యూనియన్‌ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వేముల నితిన్‌ అర్జెంటీనా నుంచి ముజీబ్‌తో సంభాషిస్తూ అర్జెంటీనా పర్వతంపై పతాక ఆవిష్కరణలు చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. తన ప్రయాణంలో సహకరించిన టీఎన్జీఎస్‌ యూనియన్‌, ముజీబ్‌, సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలి పారు. ఈ సందర్భంగా ముజీబ్‌ మీడియాతో మాట్లాడు తూ మధ్యతరగతి ఉద్యోగి అర్జెంటీనాలో పర్వతారోహణ చేసి పతాకాలు ఆవిష్కరణ చేయడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సంతోషాన్ని మాటల్లో వ్యక్తం చేయలేమనీ, అతను పంపించిన ఫోటో చూసి కండ్లల్లో నీరు తిరిగాయని తెలియజేశారు. రాబోయే రోజుల్లో నితిన్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.