
తమ సమస్యల పరిష్కారం కోసం గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్న దృశ్య గ్రామంలో ఎక్కడబడితే అక్కడ చెత్తచెదారం కురకు పోవడం, వర్షకాలంలో రహదారి అంతా మట్టితో ఉండిపోవడంతో గత్యంతరం లేక ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామ సర్పంచ్ లోలం సత్యనారాయణ తన సొంత ట్రాక్టర్ తో గ్రామంలోని పలు వీధుల గుండా ఉన్న రహదారులపై కులుకు పోయిన మట్టిని తొలగించారు. ఇదే కాకుండా గతంలో సైతం గ్రామంలో అవసరాల నిమిత్తం ఉప సర్పంచ్ రఘునందన్ రావుతో కలిసి పలు పనులను స్వయాన చేపట్టారు. సర్పంచ్ ఈ సమయంలో పనులు చేయడంతో పలువురు ఆయన చేస్తున్న పనులకు గాను అభినందనలు తెలుపుతున్నారు.