త్వరలో బీసీ గర్జన : వీహెచ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో బీసీ గర్జన సభను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు తెలిపారు. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా ఆహ్వానించనున్నట్టు చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడయా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల కోసం సీఎం కేసీఆర్‌, పీఎం మోడీ ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.