రైతు, కూలీలకు అండగా ఉండేది  కాంగ్రెస్సే…

రైతు,కూలీలకు అండగా ఉండేది  కాంగ్రెస్సే..
రైతు,కూలీలకు అండగా ఉండేది కాంగ్రెస్సే..
– ట్రాక్టర్ నడిపి, నాటు వేసిన వగ్గెల పూజ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతులకు, కూలీలకు అండగా ఉండేది కాంగ్రెస్సేనని, ఈ పార్టీతో ప్రజారంజక పాలన సాధ్యం అని టీపీసీసీ సభ్యురాలు వగ్గెల పూజ తెలిపారు.
మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తూ ములకలపల్లి మండలంలో మార్గ మధ్యలో వరి నాట్లు వేస్తున్న రైతులు, కూలీలతో కలిసి పొలంలోకి దిగి నాటు వేసుకుంటూ వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు, కూలీలకు అండగా నిలుస్తుందని ఆమె భరోసా కల్పించారు. ట్రాక్టర్ నడుపుతూ,దుక్కి చేస్తూ ప్రభుత్వం రైతులకు చెప్పిన మాయ మాటలను గుర్తుచేసి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతే రాజు అవుతాడని, భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి ఓటు వేయాలని తెలియజేయడం జరిగింది రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కట్టం వెంకటేశ్వర్లు, గోగీల కోటేశ్వరరావు, ఊకె మోహన్ రావు, సడియం వెంకటేశ్వరరావు, ములకలపల్లి ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పాలకుర్తి రవి, సడియం రాంబాబు, వరస రాంబాబు, మడివి రమణ, కట్టాం వెంకటలక్ష్మి, సున్నం నాగమణి, కుండ్రు దుర్గ, సడియం రాజ్యం, మందలపల్లి వార్డు మెంబర్ సీనియర్ నాయకులు సిరినేని వెంకయ్య, దమ్మపేట ఎస్సీ సెల్ అధ్యక్షులు తిరుపతిరావు, ఎస్.కే బషీర్ తదితరులు పాల్గొన్నారు.