సాంకేతిక సమస్య వల్లే..

– బయోటెక్నాలజీ సీట్లన్నీ
– ఎంపీసీ అభ్యర్థులకు కేటాయింపు
– బైపీసీ వారికోసం జేఎన్టీయూహెచ్‌లో 33, సీబీఐటీలో 23 సీట్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా జేఎన్టీయూ హైదరాబాద్‌, సీబీఐటీలో అందించే బయోటెక్నాలజీ కోర్సులోని అన్ని సీట్లనూ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మొదటి విడతలో ఎంపీసీ విభాగం అభ్యర్థులకు కేటాయించామనిసాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే చేరిన వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుని బైపీసీ విభాగం అభ్యర్థుల కోసం సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో 33 సీట్లు, సీబీఐటీలో 23 సీట్లు కలిపి 56 సీట్లు అలాగే ఉన్నాయని వివరించారు. బైపీసీ విభాగం అభ్యర్థుల కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌ అవి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.