నవతెలంగాణ-గూడూరు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో భీమునిపాదం జలపాతం పరవళ్తు తొక్కుతోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామపం చాయతీ కొమ్ములవంచ అటవీ ప్రాంతంలో ఉన్న భీముని పాదం జలపాతం వద్ద ఆదివారం సందర్శకుల సందడితో కిక్కిరి సింది. జిల్లాతోపాటు సుదూర ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. కాగా జలపాతం వద్ద ఎలాంటి ప్రమాదాలు సంఘటనలు జరగకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని ఏర్పాటు చేశారు.