క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పర్యటించాలి

–   ప్రజా సమస్యలను తెలుసుకోవాలి :
ఎస్పీలు, సీపీలకు డీజీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు
నవతెలంగాణ -ప్రత్యేక ప్రతినిధి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించడానికి ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ ఆదేశించారు. గురువారం తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహిం చారు. రాష్ట్ర పోలీసు ప్రతిష్టను ఇనుమడింప జేయడానికి అవసరమైన చర్యల ను ఎప్పటికప్పుడు చేపట్టాలని కోరారు. కొత్త గా పోలీసు శాఖలో చేరబోయే ట్రైనీ కాని స్టేబుళ్లు, ఎస్‌ఐలకు ట్రైనింగ్‌ ఇచ్చే కళాశాలలో మౌళిక సదుపాయాల ఏర్పాటు, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు శాంతి భద్రతలు సవ్యంగా ఉంచాల్సిన, తీసుకోవలసిన చర్య లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవసర మైన బడ్జెట్‌ తదితర అంశాలపై ఆయన ఎస్పీలు, సీపీలతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర పోలీసు శాఖను మరింతగా పటిష్ట పరచడానికి అవసరమైన నిధులు, కొత్తగా పోలీసు అధికారులు, సిబ్బంది నియామకా లకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసు శాఖకు ఎంతగానో తోడ్పాటును అందచేస్తు న్నారని అన్నారు. ఈ విధంగా ఏ రాష్ట్రంలోనూ పోలీసు శాఖకు ప్రభుత్వం అండగా నిలబడలేదని అంజనీ కుమార్‌ చెప్పారు. కొత్తగా నియమితుల వుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ పూర్తి కావస్తున్నదనీ, వీరికి శిక్షణను ఇవ్వడానికి అవసరమైన సౌకర్యాలను పీటీసీలలో వెంటనే ఏర్పాటు చేసి సిద్ధంగా ఉండాలని ఆయన అధికారుల ను కోరారు. ప్రతి పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో టారులెట్లు సరిగా నిర్వహించాలనీ, విద్యుత్‌ సౌకర్యం సరిగా ఉంచేలా చూసుకోవాలని వీటితో పాటు ఇతర సౌకర్యాలపైనా శ్రద్ద వహించాలని ఆయన తెలిపారు.