
తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్ యు కమిటీ ఆధ్వర్యంలో లైబ్రరీయన్ కు సమస్యలు పరిష్కారించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి జయంతి, ఉపాధ్యక్షుడు శివసాయి మాట్లాడుతూ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ పుస్తకాలను తీసుకురావాలని, నెట్, సెట్ కు సంబంధించిన పుస్తకాలు తీసుకురావాలని, భగత్ సింగ్, అంబేద్కర్ ఫూలే, కారల్ మార్క్స్ ఇంకా ఇతర మహనీయుల జీవిత చరిత్ర, వాళ్లు రచించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్షయ్, రవీందర్, ప్రవీణ, అశ్విత్ పాల్గొన్నారు.