ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ రజిత వెంకన్న అన్నారు మంగళవారం  15వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ శిధిలమైన ఇండ్ల ను పరిశీలించారు. శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో ప్రజలు ఉండవద్దని, అత్యవసరమైతే ప్రజలు మున్సిపల్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు. ఏదైనా సమస్య ఏర్పడినచో ఫోన్ ద్వారా తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, ఐలేని శంకర్ రెడ్డి,యండి,యుండి ఆయూబ్, పున్న సారయ్య, పున్న సమ్మయ్య, అక్కు కిరణ్, బండి శంకర్, తదితరులు పాల్గొన్నారు.