భవిష్యత్‌ తరానికి మార్గదర్శం ఇండో ఇన్ఫ్రా..

–  బిజినెస్‌ కనెక్ట్‌ మెగా జీన్‌ ప్రతిష్టాత్మక అవార్డ్స్‌ ..
నవతెలంగాణ -హైదరాబాద్‌
ఇండో ఇన్ఫ్రా గ్రూప్స్‌ ప్రత్యేక ప్రాజెక్టులను రూపకల్పన చేస్తూ భవిష్యత్‌ తరానికి మార్గదర్శకంగా నిలిచింది. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారణ లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలతో భవిష్యత్‌ తరానికి ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అండ్‌ ఇన్ఫ్రా స్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం శివ గణేష్‌ బాబు యంగ్‌ రీజినర్‌ సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌ 2022, ఎకో 02 జోన్‌ విల్లాస్‌ ప్రాజెక్టుకు మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ అండ్‌ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022 అవార్డులను అందుకున్నారు. బిజినెస్‌ కనెక్ట్‌ నేషనల్‌ మెగాజిన్‌ ఢిల్లీలో నిర్వహించిన ఇండో గ్లోబల్‌ ఎంటర్ప్రెన్యూర్షిప్‌ ఫోరమ్‌ 2023 కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డు పొందిన సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంస్థ ఫౌండర్‌, సీఈవో, ఎండి మల్లెం శివ గణేష్‌ బాబు మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని దష్టిలో ఉంచుకొని కాలుష్య నివారణకు మా వంతు కషి చేస్తున్నామన్నారు. ఆ సంకల్పంతోనే ఈ ప్రాజెక్టుకు రూప కల్పన చేయడం జరిగిందన్నారు. ఘట్కేసర్‌ సమీపంలో ఔశాపూర్‌లో ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందని, ఈ ప్రాజెక్టులతో భవిష్యత్తు ఫ్రీ హైదరాబాద్‌ పొల్యూషన్‌ ని, ఆక్సిజన్‌ కాన్సెప్ట్‌ తో యాభై రకాల ఎక్కువ ఆక్సిజన్‌ విడుదల చేసేటువంటి పదివేలు పైగా మొక్కలును, చెట్లను పరిశోధించి ప్రాజెక్టులో నెలకొల్పడం జరిగిందన్నారు. ఆ కమ్యూనిటీలో ఉష్ణోగ్రతలు తక్కువ, ఆక్సీజన్‌ లెవల్స్‌ ఎక్కువ ఉండేటట్లుగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్యంగా బ్రతకడానికి కావలసిన హెల్త్‌ అమ్యూనిటీస్‌ అయినటువంటి యోగా జోన్‌, మెడిటేషన్‌ జోన్‌, సన్‌ లైట్‌ లో ఓపెన్‌ జిమ్‌, ఫుట్‌ రిఫ్లెక్జాలటీ, వాకింగ్‌ ట్రాక్‌, పెబ్బెల్స్‌ వాకింగ్‌ ట్రాక్‌ ప్రత్యేక ప్రణాళికతో రూపుదిద్దు తున్నామన్నారు. ఎకాలజీ బ్యాలెన్స్‌ కొరకు బర్డ్స్‌, బటర్ఫ్లై గార్డెన్‌, పెట్స్‌ కొరకు పెట్స్‌ గార్డెన్‌, ఆయుర్వేద మొక్కలతో హెర్బల్‌ గార్డెన్‌ తదితర వినూత్నమైన స్సదుపాయాలతో మనిషి ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవించే విధంగా కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవార్డు రావడం మాకెంతో సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులైనా ఎం వాసవి, పి శివకష్ణ, కే కళ్యాణ్‌, ఈ మల్లికార్జున్‌, కే వెంకటేష్‌ , ఎస్‌ బాల్‌ రడ్డి, డి దేవరాకు, ఎం అజరు బాబు, ఎన్‌ ఆనంద్‌, బి ఎన్‌ గౌడ్‌, బి వెంకట్‌, పి శివయ్య తదితరులు పాల్గొన్నారు.