గ్రామాలలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్, తోటపల్లి గ్రామాలలో గురువారం గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద రెవిన్యూ అధికారులు ఓటు హక్కు వినియోగం పై అవగాహన కల్పించారు. తోటపల్లి పోలింగ్ కేంద్రం 55, గాంధీనగర్ పోలింగ్ కేంద్రం 56&57 లో ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా ఓటరుకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సర్పంచులు దుండ్ర భారతి జనార్ధన్, పోలవేణి లత సంపత్, గిర్దవరు సుహాసిని, జూనియర్ అసిస్టెంట్ కరీం తదితరులు పాల్గొన్నారు.