బీసీలకు 47% శాతం రిజర్వేషన్లు  ఇవ్వాలని డిమాండ్..

నవతెలంగాణ- డిచ్ పల్లి

తెలంగాణ యూనివర్సిటీలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్లు కేటాయింపు, అమలులో, అంశం పై గురువారం తెలంగాణ యూనివర్సిటీ లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొన్ని సంస్థలు కుట్రపూరితంగా, వివక్షపూరితంగా నిర్లక్షపూరితమైన వైఖరిని వ్యవహరిస్తున్నాయని, అన్ని రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్ల అమలు కేటాయింపులలో తమిళనాడును ఒక నమూనాగా తీసుకొని బీసీలకు 47% శాతం రిజర్వేషన్లు  ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తమిళనాడులో బీసీలకు జనాభా ప్రతిపాదికన 47% శాతం రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుందని, దీనివల్ల సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. బీసీ జాతి ప్రజలందరికీ కూడా సముచిత న్యాయం, సమోచిత ప్రాధాన్యత, సామాజిక న్యాయం జరుగుతుందని, ఇప్పటికీ దేశంలో రిజర్వేషన్లు అమలుపరచలని న్యాయస్థానాలలో, రాజ్యసభ, శాసనమండలి, రాజకీయ రిజర్వేషన్లు కూడా వర్తింపజేసి అందరికీ న్యాయం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, సెక్రెటరీ నరేష్, ప్రశాంత్, గణేష్, సూర్య భాయ్, యాదగిరి, సాయిబాబ పాల్గొన్నారు