విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

–  ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ ఘనంగా ఎంబీఏ ఫ్రెషర్స్‌ ఇండక్షన్‌
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థులు మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ సూచించారు. ఓయూ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ ఆడిటోరియంలో ఎంబీఏ విద్యార్థుల ఇండక్షన్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు ఓయూలో ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు వినియోగించుకొని విద్యలో రాణించాలని కోరారు. మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి సూచించారు. ప్రిన్పిపాల్‌, విభాగం హెడ్‌ ప్రొఫెసర్‌ డి.శ్రీరాములు మాట్లాడుతూ నూతన విద్యార్థులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ముందుకుపోతూ విభాగం, తల్లిదండ్రులు కన్నకలలు సాకారం చేయాలన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ కె.భరద్వాజ్‌ మాట్లాడుతూ మార్కెట్‌లో ఎంబీఏ విద్యార్థులకు ఉన్న అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో విభాగం ప్రొఫెసర్స్‌ రామల, నాగేశ్వరరావు, డీన్‌ వెంకటయ్య, జహంగీర్‌, విద్యా సాగర్‌, సంపత్‌, స్మిత, సుధ, సమున్నత, విద్యార్థులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.