– భారత్ 351/5
– రోహిత్, కోహ్లికి విశ్రాంతి
టరోబా: నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ సెంచరీ భాగస్వామ్యంతో కదం తొక్కారు. బ్రియాన్ లారా స్టేడియంలో మంగళవారం ప్రారంభమైన మూడో, చివరి వన్డేలో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్-శుభ్‌మన్ గిల్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 143పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ కిషన్ కేవలం 43బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్ల సాయంతో అర్ధసెంచూరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో వరుసగా మూడు వన్డేల్లో అర్ధసెంచరీలు కొట్టిన బ్యాటర్ల సరసన నిలిచి రికార్డు నెలకొల్పాడు. నిర్ణయాత్మక వన్డేలోనూ సీనియర్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి బెంచ్‌కే పరిమితమయ్యారు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్(85), సంజు శాంసన్(51; 421బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు ధనా ధన్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కారు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా(70నాటౌట్; 52బంతుల్లో 4ఫోర్లు, 5 సిక్సర్లు) స్ఫూర్తి దాయక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(35; 2ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 351పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లు షెఫర్డ్‌కు రెండు, జోసెఫ్, మోటీ, కరియన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
రుతురాజ్, ఉనాద్కత్‌కు చోటు
టీమిండియా మేనేజ్‌మెంట్ రెండు మార్పులు చేసింది. రెండో వన్డేలో ఆడిన అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్‌లను బెంచ్‌కు పరిమితం చేసి రుతురాజ్ గైక్వాడ్, జయదేవ్ ఉనాద్కట్‌లకు చోటు కల్పించింది. టాస్‌కు వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. డిసైడర్ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు కుర్రాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారని, పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని తప్పక ఉంచుతామని తెలిపాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ప్రయోగాలకు ఈ సిరీస్‌ను వాడుకుంటున్న టీమిండియా.. కోహ్లీ, రోహిత్‌లకు రెస్ట్ ఇచ్చి మరీ బెంచ్ బలాన్ని పరీక్షిస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలవడంతో ఈ మ్యాచ్ డిసైడర్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెస్టిండీస్ కెప్టెన్ షారు హోప్ తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నామని, ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే నిలకడగా రాణించడం ముఖ్యమని తెలిపాడు.
స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (స్టంప్)హోప్ (బి)కరియన్ 77, శుభ్‌మన్ (సి)కరియన్ (బి)మోటీ 85, రుతురాజ్ గైక్వాడ్ (సి)కింగ్ (బి)జోసెఫ్ 8, సంజు (సి)హెట్‌మెయిర్ (బి)షెఫర్డ్ 51, హార్దిక్
సూర్యకుమార్ వికెట్ల పతనం: 1/143, 2/154, 3/223, 4/244
బౌలింగ్: సీలెస్ మయర్స్ జోసెఫ్ మోటీ షెఫర్డ్ కరియన్
రికార్డుపుటల్లో ఇషాన్..
మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు అర్ధసెంచరీలు కొట్టి ఆటగాళ్ల జాబితాలో భారత వికెట్ కీపర్, ఓపెనర్ ఇషాన్ కిషన్ చేరాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలోనూ అర్ధసెంచరీ బాదిన ఇషాన్.. తొలి వన్డేలో 52, రెండో వన్డేలో 55పరుగులతో సత్తా చాటాడు ఈ క్రమంలో మూడో వన్డేలోనూ అర్ధసెంచరీ పూర్తి చేసుకొని ఈ రికార్డును సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మొత్తమ్మీద 64బంతులు ఎదుర్కొన్న ఇషాన్ 8ఫోర్లు, 3సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేసి కరియా బౌలింగ్‌లో షారు హోప్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు.
వరుసగా మూడు వన్డేల్లో
అర్ధసెంచరీలు కొట్టిన భారత బ్యాటర్లు..
1. కృష్ణమాచారి శ్రీకాంత్ : శ్రీలంకపై(1982)
2. దిలీప్ వెంగ్‌సర్కార్ : శ్రీలంకపై(1985)
3. మహ్మద్ అజహరుద్దీన్ : శ్రీలంకపై(1993)
4. ఎంఎస్ ధోనీ : ఆస్ట్రేలియాపై(2019)
5. శ్రేయస్ అయ్యర్ : న్యూజిలాండ్‌పై(2020)
6. ఇషాన్ కిషన్ : వెస్టిండీస్‌పై(2023)