
పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలే శ్రేష్టమని, ముర్రిపాలు పుట్టిన వెంటనే బిడ్డకు తాగించాలని 23వ వార్డు కౌన్సిలర్ నాయకo లక్ష్మణ్ , 18 వ వార్డు కౌన్సిలర్ అడ్డగట్ల కావేరి అంజి,17వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధా వేణుగోపాలు అన్నారు. బుధవారం ఆయా వార్డుల్లో అంగన్వాడి కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిడ్డకు తల్లిపాలే ఉత్తమ ఆహారమని, తల్లిపాలకు మించిన ఔషధం లేదని అన్నారు. ఐసిడిఎస్ ద్వారా
ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికరమైన ఆహారాన్ని బాలింతలు, తల్లులు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 సార్లు తల్లిపాలు ఇవ్వాలని, ఆరు మాసాల వరకు తల్లిపాలు తప్ప వేరేవి ఇవ్వద్దని, పాలు ఇచ్చే తల్లులు సీతల పానీయాలు లాంటివి తీసుకోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో
అంగన్వాడి టీచర్ వనిత, పుష్పలత, పద్మ, శృతి, రమ, భవాని, శైలజ, వెంకటమ్మ, ఆశా వర్కర్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.