నిరుద్యోగి ఆత్మహత్య

నవతెలంగాణ – చిన్నకోడూరు

ఉన్నత విద్యనభ్యసించిన యువకుడు ఉద్యోగ రావడంలేదని జీవితంపై విరక్తి చెంది, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నకోడూరు మండల పరిధిలోని విఠలాపూర్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ సుభాష్ గౌడ్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఎడ్ల ఉపేందర్ రెడ్డి బిటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. తోటి మిత్రులు ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారని తనకు ఏ ఉద్యోగం లభించడం లేదని మనస్తాపంతో జీవితం పై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.