కండ్ల కలక పై జాగ్రత్తలు పాటించాలి..

– కంటి వెలుగు టీం అధికారి శ్రీనాథ్
నవతెలంగాణ-కోహెడ
కండ్ల కలక పై ఆందోళన చెందవద్దని, అవగాహనతోనే వ్యాధిని  దూరం చేయొచ్చని కంటి వెలుగు జిల్లా టీం అధికారి శ్రీనాథ్  తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్  ఆదేశాల మేరకు  కోహెడ మండలం శనిగరం హాస్టలను, పాఠశాలలను కంటి వెలుగు టీం  సందర్శించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కండ్ల కలక వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు . వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించనట్లయితే వ్యాధి దరిచేరదని తెలిపారు.కండ్ల కలక  వ్యాధితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే దీని భారి నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. వ్యాధి సోకినవారు ఐసోలేషన్ లో ఉంటూ వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ఇతరులకు  వ్యాధి సోకకుండా నల్లటి కళ్లద్దాలు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు టీం అధికారులు  శ్రీనివాస్, భద్రయ్య, మహేందర్, డాక్టర్ రిమిషా పర్హిన్,  స్థానికఏఎన్ఎం,  ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.