ఉబర్‌ అడ్డగోలు దోపిడి

Uber is a scam– ఆ సంస్థ సిఇఒకు ఊహించని షాక్‌
వాషింగ్టన్‌ : ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబర్‌ అడ్డగోలు దోపిడి మరోసారి బట్టబయలయ్యింది. ఈ అంశంలో ఆ కంపెనీ సిఇఒ ఖోస్రోషాహి అనుహ్యాంగా ఇరుక్కుపోవడంతో.. ఉబర్‌ అబాసు పాలవుతోంది. మ్యాగజైన్‌ సంస్థ వైర్డ్‌ ఎడిటర్‌ స్టీవెన్‌ లెవీ ఉబర్‌ సిఇఒని ఇంటర్యూ చేసేందుకు ఉబర్‌ క్యాబ్‌ను బుక్‌ చేసుకున్నారు. ఆ క్యాబ్‌లో న్యూయార్క్‌లోని డౌన్‌టౌన్‌ సిటీ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో వెస్ట్‌సైడ్‌ ఉబర్‌ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడే 2.95 మైళ్ల ఉబెర్‌ రైడ్‌ ఛార్జీ ఎంత అయ్యింటుందో చెప్పాలని స్టీవెన్‌ లెవీ.. ఖోస్రాషాహిని అడిగారు. అందుకు ఉబర్‌ సిఇఒ ఇరవై డాలర్లు కావొచ్చని అన్నారు. కానీ అనూహ్యంగా డ్రైవర్‌ టిప్‌తో కలిపి ఉబర్‌ రైడ్‌కి 51.69 డాలర్లు (దాదాపు రూ.4,300) ఛార్జ్‌ చేశారని స్టీవెన్‌ లెవీ పేర్కొనడంతో ఉబర్‌ బాస్‌ ఖంగుతున్నారు. ఓరి దేవుడా అంటూ ఖోస్రోషాహి కొద్ది క్షణాల్లో షాక్‌ నుంచి తేరుకుని ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం గమనార్హం. ఆ రైడ్‌కు కొన్ని నిమిషాల ముందు 20 డాలర్లు చూపించిందని.. ఆ తర్వాత సర్జ్‌ ఫ్రైస్‌ పేరిట భారీ మొత్తం పెరిగిందని.. ఈ సర్జ్‌ ప్రైస్‌కు అర్థం లేదంటూ ఖోస్రోషాషితో జర్నలిస్ట్‌ స్టీవెన్‌ అన్నారు.