
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ సందర్భంగా డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘనపూర్ గ్రామంలోని పాఠశాలలు, కాలేజీల్లో అల్బెండాజోల్ టాబ్లెట్స్ ను పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఇందల్ వాయి మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ మాట్లాడుతూ పాఠశాలలకు రాని పిల్లలకు 10 తేదీ నా మాత్రలను అందజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలోఎంఎల్ హెచ్ పి గంగ భవాని, ఎఎన్ఎం లు గొల్లపల్లి శైలజ, రజిత, ఆశ కార్యకర్తలు లక్ష్మి, వనిత, అరుణ, సరిత పాల్గొన్నారు.