
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వమని మండల పార్టీ అద్యక్షుడు దండుగుల మల్లయ్య అన్నారు. గురువారం మండల కేంద్రం లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, కెటీఆర్ల ప్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని రైతులకిచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశారని అన్నారు. 17 వేల 351 కోట్ల రుణాలు మాఫీ చేయగా ప్రస్తుతం 29.61 లక్షల రైతు కుటుంబాలకు మరో 19 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రమణయ్య, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు పళ్ళ బుచ్చయ్య, మాజీ మండల అధ్యక్షులు బండారి చంద్రయ్య, దిడ్డి మోహన్ రావు, ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రారెడ్డి, జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం, టిఆర్ఎస్ జిల్లా యూత్ ఉపాధ్యక్షులు శైలేందర్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షురాలు గడ్డం అరుణ, సామ నాగమ్మ, కొర్నేపల్లి శేషగిరి, ఈక రామయ్య, బందెల తిరుపతి, గజ్జల సమ్మయ్య, జైపాల్ రెడ్డి, చల్ల రజనీకర్ రెడ్డి, తాటి రామచందర్, మల్లెల నాగేష్ యాలం విక్రమ్, సల్లూరి లక్ష్మణ్, గంగారం సర్పంచ్ గౌరబోయిన నాగేశ్వరరావు, దానక నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.