కిరాణా దుకాణంలో చోరీ..

– పదివేల రూపాయల అపహరణ

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బస్టాండ్ కు కూత వేటు దూరంలో గురువారం నాలుగు గంటల ప్రాంతంలో ఒక  కిరాణా దుకాణంలో యువకుడు గడ్డపారతో షేట్టర్ ను ధ్వంసం చేసి దుకాణం కౌంటర్లో ఉన్న దాదాపు పదివేల రూపాయలు, చాక్లేట్లు ఇతర వస్తువులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. ఉదయం దుకాణం తీయడానికి వచ్చేలోపే చుట్టుపక్కల ఉన్నవారు దుకాణపు యజమానికి సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కిరాణా దుకాణం ను సందర్శించి సిసి కెమెరాలో రికార్డు అయిన వివరాలను సేకరించారు. దుకాణం షేట్టర్ ను ధ్వంసం చేసే సన్నివేశం స్పష్టంగా రికార్డయ్యాయి. డబ్బులు తీసుకొని వెళ్లేటప్పుడు పక్కనే ఉన్న సీసీ కెమెరా కంటపడడంతో అది కూడా తమ వెంట ఎత్తుకు వెళ్ళినట్లు తెలిపారు.ఇందల్ వాయి మండల కేంద్రంలో ఉదయం వెకువ జామున ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఇతర వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.