వీధి వ్యాపారులతో సమావేశం..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
అబిడ్స్ జిహెచ్ఎంసి కార్యాలయంలో గురువారం వీధి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి గోషామహల్ సర్కిల్ -14 డిప్యూటీ కమిషనర్ డి బాలయ్య. యు సి డి పి ఓ విద్యాసాగర్. టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ముకేశ్ సింగ్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్, ల్యాండ్ ఆర్డర్ ఎస్ఐ మధుసూదన్, సిఓ సమ్మయ్య, పాల్గొన్నారు. విధి వ్యాపారులు జిహెచ్ఎంసి నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్ పోలీసుల ఆదేశాలను పాటించాలని సూచించారు. యు సి డి ద్వారా వీధి వ్యాపాలకు రుణాలు అందిస్తున్నామన్నారు. సమావేశంలో విధి వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.