కరెంట్‌ అఫైర్స్‌

రుద్రగిరి కొండల్లో మధ్యతరగతి యుగపు కళాఖండాలు : గుంటూరు జిల్లా ఓర్వకల్లి గ్రామంలో మధ్యరాతి యుగం కాలం నాటి చిత్రలేఖనాలు మరియు కాకతీయ రాజవంశానికి చెందిన అద్భుత కళాఖండాలు కనుగొనబడ్డాయి. ఈ రుద్రగిరి కొండలు క్రీ.పూ. 5000 మధ్యరాతి యుగంంలో ప్రజలకు నివాస గృహాలుగా పనిచేశాయి. ఈ కొండకు దక్షిణాన 2 సహజ సిద్ధ గుహల్లో కాకతీయ రాజ్యానికి చెందిన కుడ్య చిత్రాలు కనుగొనబడ్డాయి. మొదటి గుహలో వానర సోదరులు వారి సుగ్రీవుల యుద్ధ సన్నివేశం, 2వ గుహలో హనుమంతుడు సంజీవని పర్వతం ఎత్తుకొన్న రామాయణ సన్నివేశం, 3వ గుహలో మధ్యరాతియుగం నాటి చరిత్ర పూర్వ రాతి చిహ్నాలు వున్నాయి. ఈ మధ్యరాతి యుగం (రాతి యుగం 2 వ భాగం) ను మెసోలిధిక్‌ యుగం అని పిలుస్తారు (క్రీ.పూ. 9000 నుంచి క్రీ.పూ.4000 వరకు). ఈ యుగం నాటి మెక్రోలిత్స్‌ (చిన్న బ్లేడ్‌ స్టోన్‌) టూల్స్‌ కనిపించాయి. ఈ యుగంలో ప్రజలు వేట, చేపలు పట్టడం, ఆహార సేకరణపై ఆధారపడి జీవించారు.
2.09 లక్షల కోట్ల మొండి బకాయిలు రద్దు : 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యాంకులు 2.09 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్ధు చేశాయి. గత ఐదేళ్లలో బ్యాంకింగ్‌ రంగం మొత్తం రుణ మాఫీ 10.57 లక్షల కోట్లకు చేరుకుంది. సమాచార హక్కు చట్టం అడిగిన ప్రశ్నకు బదులుగా రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ భారీ రుణమాఫీ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గడానికి దోహదం చేశాయి. అయితే బ్యాంకులు మాఫీ చేసిన రుణాలు ఇప్పటికీ వారి పుస్తకాల్లో తిరిగి చెల్లించని రుణాలుగా నమోదు అవుతాయని గమనించాలి.
అంతర్జాతీయ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ను ప్రారంభించిన భారత్‌ : భూమిపై వున్న 7 పెద్ద పిల్లి జాతులను సంరక్షించే లక్ష్యంతో భారతదేశం ఇటీవల ఇంటర్నేషనల్‌ బిగ్‌ క్యాట్‌ అలయన్స్‌ ను ప్రారంభించింది. 70 శాతం పులులకు భారతదేశం నిలయంగా ఉండడానికి కారణం అయిన ప్రాజెక్ట్‌ టైగర్‌ యొక్క విజయం ప్రేరణతో ×దీజA పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్‌ వంటి పెద్ద పిల్లి జాతులను రక్షించడం, సంరక్షించడంపై దృష్టి సారిస్తుంది. పెద్ద పిల్లులతో సంబంధం వున్న మొత్తం పర్యావరణ వ్యవస్థకు మద్ధతు ఇవ్వడానికి ఆర్థిక, సాంకేతిక వనరులను సమీకరించడంలో కీలక పాత్ర పోషించి తద్వారా వాటి సంరక్షణను నిర్థారిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు.
వరల్డ్‌ సిటీస్‌ కల్చర్‌ ఫోరమ్‌లో చేరిన మొదటి భారతీయ నగరం – బెంగళూరు : కర్ణాటకకు రాజధాని బెంగళూరు ప్రపంచ నగరాల సంస్కృతి ఫోరమ్‌ (ఔజజఖీ) లో భాగమైన మొదటి భారతీయ నగరంగా అవతరించింది. ఇది భవిష్యత్‌ శ్రేయస్సులో సంస్కృతి యొక్క పాత్రను అన్వేషించడానికి, పరిశోధన మేధస్సును పెంచుకునే ప్రపంచ నగరాల నెట్‌వర్క్‌ ఫోరమ్‌లో చేరిన 41వ నగరంగా బెంగళూరు అవతరించింది. నెట్‌వర్క్‌లో ప్రస్తుతం ఆరు ఖండాల్లో 40 నగరాలు వున్నాయి. ఫోరమ్‌లో న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌, టోక్కో, దుబారు వంటి నగరాలు వున్నాయి.
ఔుఉ 13వ మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షుడు – ధానీ అల్‌ జెయోదీ : అబుదాబిలో జరగనున్న ప్రపంచ వాణిజ్య సంస్థ 13వ మంత్రివర్గ సమావేశానికి ఖAజు విదేశీ వాణిజ్య మంత్రి ధానీ అల్‌జెయోదీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
జెనీవాలోని ఔుఉ జనరల్‌ కౌన్సిల్‌లో ఔుఉ డైరెక్టర్‌ జనరల్‌ న్గోజి ఒకోంజో – ఇవాలా తో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
ఎపి హైకోర్టు నూతన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ : ఎపి హైకోర్ట్‌ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
జమ్ముకాశ్మీర్‌ కు చెందిన జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ గతంలో బాంబే హైకోర్ట్‌లో న్యాయమూర్తిగా పనిచేసి ఎపి హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సిజేగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ రాకతో న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది.
UAR MERS – COV మొదటి కేసును గుర్తించిన WHO : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడిలో మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనా వైరస్‌ (MERS – COV) కేసును ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.
( MERS – COV అనేది COV  గా పిలువబడే ఒక కరోనావైరస్‌ వలన కలిగే వైరస్‌ శ్వాసకోశ సంక్రమణం) సంక్రమణం సహజ హేస్ట్‌ మరియు జూనోటిక్‌ మూలం అయిన డ్రోమెడరీ ఒంటెలతో ప్రత్యక్ష లేదా పరోక్ష పరిచయం ద్వారా సంక్రమణ మానవులకు వ్యాపిస్తుంది.
– కె. నాగార్జున
కరెంట్‌ ఎఫైర్స్‌ సీనియర్‌ ఫ్యాకల్టీ
9490352545