మహాత్ముల మహోద్యమాలతో
అమర వీరుల బలిదానాలతో
దేశ భక్తుల త్యాగ ఫలాలతో
భారతావనికి స్వరాజ్యమొచ్చింది !
తెల్ల దొరలు వెళ్ళిపోయారు.!
నల్ల నేతలు పల్లకీనెక్కారు.!
స్వాతంత్య్రం వచ్చి ఏడు పదులు దాటినా
స్వదేశంలో కుచేల సంతతి పెరిగి
అప్పులు కుప్పలుగా నిలిచె.
కానీ…సమగ్రాభివది శూన్యం..?
గద్దెనెక్కిన వాడు
గుట్టుగా దోచుకున్నాడు.
కొలువులను అడ్డం పెట్టుకొని
అధికారులు తెలివిగా గుంజుకున్నారు..?
దేశంలో వ్యక్తి స్వార్థాలు పెరిగిపోయాయి..?
రాజకీయ, అధికార అవినీతి
గుర్ర పు డెక్కలా సర్వత్రా
సమాజంలో అల్లుకుపోయాయి..?
ఎన్ని ప్రణాళిక లు వేసినా..
పేదరికం దేశానికి చుట్టరికం లా మారింది..!
ఇంకా దేశం ఎలా ముందుకు వెళ్లుతుంది..??
దేశంకి పూర్వ వైభవం రావాలంటే
ఆనాటిమహాత్ములు మరలా పుట్టాలి..!
అలనాటి త్యాగధనులు తిరిగి జన్మించాలి..!
నవ భారతాన్ని ప్రగతి పథంలో నడప టానికి..
జావగారిన జాతిలో నవ జీవన చేతనం నింపటానికి..!!
– జి.సూర్య నారాయణ, 6281725659