‘గృహలక్ష్మి’కి దరఖాస్తుల వెల్లువ

నవతెలంగాణ-మహాదేవపూర్‌
గృహలక్ష్మి ఇండ్ల నిర్మాణానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయానికి జనం బారులు తీరారు. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. సొంత జాగా ఉంటే ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ప్రవేశపెట్టింది. ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇవ్వడంతో ప్రజలు దరఖాస్తులు పట్టుకొని తహసీల్దార్‌ కార్యాలయానికి పరుగులు పెడుతున్నారు. దరఖాస్తుల కౌంటర్‌ వద్ద భారీగా జనం గుమిగూడారు.