నవతెలంగాణ-మంగపేట : జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు పైడాకుల అశోక్ సోమవారం ప్రకటించిన జిల్లా కమిటిలో మండలానికి పెద్దపీట వేశారు. 72 మందితో ప్రకటించిన జంబో కమిటీలో మండలానికి చెందిన 13 మందికి అవకాశం కల్పించారు. జిల్లా కమిటీలో ఉపాద్యక్షుడుగా రాజుపేటకు చెందిన వల్లెపల్లి శివయ్య, ప్రదానకార్యదర్శిగా రామచంద్రునిపేటకు చెందిన వెంగళ బుచ్చిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధిగా దోమెడకు చెందిన అయ్యోరి యానయ్య, జిల్లా ప్రచారకార్యదర్శులుగా రమణక్కపేటకు చెందిన కోడం బాలకృష్ణ, కమలాపురంకు చెందిన చింతా పున్నారావు, కార్యనిర్వాహకకార్యదర్శిగా కమలాపురంకు చెందిన శిద్దంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులుగా కోమటిపల్లికి చెందిన దామెర సారయ్య, కమలాపురంకు చెందిన తూడి భగవాన్ రెడ్డి, కోమటిపల్లికి చెందిన మసిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులుగా సంగంపల్లికి చెందిన వేములమడ సాంబశివరావు, కమలాపురంకు చెందిన ఆకు పవన్, మల్లూరుకు చెందిన గడ్డం చిరంజీవిలను కమిటీలోకి తీసుకుని మంగపేట మండలంపై కాంగ్రెస్ జిల్లా నాయకత్వం ముఖ్యంగా ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ఉన్న అభిమానాన్ని మరోసారి నిరూపించారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా కమిటీలోకి తీసుకున్న నాయకులకు మండల పార్టీ అద్యక్షుడు మైల జయరాం రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అద్యక్షుడు గుమ్మడి సోమయ్య నాయకులు హర్షం వ్యక్తం చేశారు.