నవతెలంగాణ -మంగపేట: మండలంలోని గృహలక్ష్మి పథకం దరఖాస్తు దారులకు కులము, నివాసము, ఆదాయము ధృవీకరణ పత్రాల జారీలో మీసేవలో జరిగే ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దరఖాస్తులు అప్లై చేసుకునే గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడెల నరేష్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ధరఖాస్తుల కోసం మీ సేవ, ఆన్లైన్ సెంటర్లలో ధరఖాస్తుదారులు ఇబ్బందులు పడుతున్నారని నిరక్షరాస్యులైన పేదలు గృహలక్ష్మీ పథకం కోసం ఎలా అప్లై చేయాలో ఏమి సరిఫికెట్స్ పెట్టాలో కూడా తెలియని అమాయక్తవంలో ఉండడంతో మండలంలోని మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఒక్కో దరఖాస్తు ఆన్లైన్ కు ప్రభుత్వ నిభందనల మేరకు 45 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా ధరఖాస్తుదారుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారి నుండి 250 నుండి 350 రూపాయలు ధరఖాస్తు పెట్టడానికి తీసుకుంటూ వారిని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కొందరు దరఖాస్తుదారులు ఏమీ తెలియని తనంతో పాత సర్టిఫికెట్లు కూడా పెట్టి ధరఖాస్తులు చేస్తున్నారని వీరిని కూడా పరిగణలోకి తీసుకోని గృహలక్ష్మి పథకానికి అర్హులుగా ఎంపిక చేయాలని నరేష్ డిమాండ్ చేశారు.