వ్యాస రచన పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణి..

నవతెలంగాణ -జుక్కల్

మండలంలోని కస్తుర్బాగాందీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో వైద్యఆరోగ్యశాఖ అధ్వర్యంలో వ్యారచన పోటీలో గెలుపొందిన వారికి అందించడం జర్గింది. బుదువారం నాడు కేజిబివి ప్రత్యేక అధికారిని అశ్వినీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెడికల్ మరియు హెల్త్ డిపార్ట్ మెంట్ బహుమతులు పంపిణి చేసారు. మెుదటి బహుమతి పదవ తరగతి శ్రద్ద, తొమ్మిదవ తరగతి సుమతి, ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న లక్ష్మి కి ప్రశంస పత్రంతో పాటు శాలువాతో మెడికల్ & హెల్త్ అధికారులు, సిబ్బంది సన్మానించి శ్రద్దతో పెట్టి చదువుకొని ఉన్నత శిఖరాలను చేరాలని  అకాంక్షించారు. కార్యక్రమంలో వైద్యులు విఠల్, విక్రమ్, ఎంఎల్ పిహెచ్ శేషి, రాందాస్, యేాగేష్, మాదవ్, ఆరోగ్య, బోదకుడు దస్తీరాం, కస్తుర్బా ప్రిన్సిపాల్ అశ్వినీ,  ఉపాద్యాయునిలు, స్వాతీ, నజీమా, జ్యోతీ, తదితరులు పాల్గోన్నారు.