
వేల్పూర్ మండలంలో గ్రామం రామన్నపేటలో అవినీతి రాజ్యమేలుతోంది ప్రశ్నించే గొంతుపై కత్తి పెడుతున్నారు అయ్యా అధికారులారా మా గ్రామంలో సిసి రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధుల ద్వారా సుమారు గత నాలుగు సంవత్సరాల నుంచి మా ఊరికి ఒక కోటి 20 లక్షల పైచిలుకు నిధులతో సిసి రోడ్లు చేపట్టినారు అవి పూర్తిగా నాణ్యత లోపించి పనిచేయడం వలన నాసీరకంగా చేయడం వలన అవి సంవత్సరంలోపే పూర్తిగా చెడిపోయి ప్రజలకు ఎంతో ఇబ్బందికరంగా మారినాయి అటు చిన్న పిల్లలకి గాని మహిళలు గాని ప్రజలకు గాని పశువుల గాని కంకర తేలిన ఆ రోడ్లపై నడవడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది పూర్తిగా కంకర తేలినాయి వాటికి ఆ చేసిన పనులకు చెక్కులు ఇవ్వాలని నన్ను సంతకం చేయాలని నాపై అధికారులు ఒత్తిడి, కాంట్రాక్టర్లు ప్రలోభాలు చేస్తూనే ఉన్నారు అయినా నేను చేయను వాటిని రికవరీ చేపించే వరకు ప్రజల అభ్యర్థన మేరకు పాలకవర్గ వార్డ్ మెంబర్ సూచన మేరకు వాటిపై సంతకం చేయలేదు అందువలన నా చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు ఈ రోజు నాకు షోకాసు నోటీసు ఇవ్వడం చాలా బాధాకరం అవినీతిపై నాణ్యత లోపించిన పనులపై ప్రశ్నించినందుకు నా చెక్ పవర్ రద్దు చేయడం చాలా బాధాకరం నేను 16/5 /2022న పంచాయతీ అధికారలకు కలెక్టర్ కి డిపిఓ మేడం కి 2021- 22 లోనిర్మించిన సీసీ రోడ్ల పనుల ప్రజల అభ్యర్థుల మేరకు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా ఏ ఒక్క అధికారి వచ్చి పరిశీలించలేదు అంతేగాక ఆ పనులకు పనులు బిల్ అయింది ఇప్పుడు దాని గురించి అడగవద్దు అని అధికారులు అంటున్నారు ఇప్పుడు 42 లక్షల సిసి రోడ్లపై క్వాలిటీ రిపోర్టు ఇవ్వలేదు ఇష్ట రాజ్యాంగ అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజాధనాన్ని కాజేస్తున్నారు ఈ కాంట్రాక్టర్లు ప్రజల పక్షాన ప్రశ్నించే నాపై చర్యలు తీసుకోవడం చాలా బాధాకరం అయినప్పటికీ మా గ్రామ అభివృద్ధి విషయంలో నేను నిరంతరంపోరాడుతూనే ఉంటా నా అధికారం కన్నా నా గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అవినీతిపైన పోరాటం నిరంతరం సాగుతూనే ఉంటుంది అవినీతి మయంలో రామన్నపేట గ్రామ పంచాయితీకి నేను నా ఉప సర్పంచ్ పదవికి అదే విధంగా నా వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేస్తున్నాను రామన్నపేట గ్రామ ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాను నిరంతరం అని తెలిపారు