ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌కు కొత్త ఆవిష్కరణ

– యంత్రాన్ని తయారు చేసిన యువ ఇంజినీర్‌
హైదరాబాద్‌ : ఆధునిక కాలంలో వ్యర్థాల తరలింపు ఒక ప్రధాన సమస్యగా మారింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు ఎక్కడ చూసినా ఖాళీ మంచినీళ్ల బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. వీటి సేకరణ, తరలింపు భారమైన నేపథ్యంలో ఒక యువ ఇంజినీర్‌ కంచాడపు శ్రీనివాస్‌ రావు సరికొత్త ఆవిష్కరణ చేశారు. 12 ఓల్టుల విద్యుత్‌ వినియోగించి వేడెక్కిన స్ట్రింగ్‌ సహాయంతో ఏవైనా ప్లాస్టిక్‌ వస్తువులను కత్తిరించవచ్చు అలాగే ఖాళీని తగ్గించవచ్చు. ఈ సూత్రం ఆధారంగా స్థలాన్ని తగ్గించడమే లక్ష్యంగా చేసుకొని ఈ యంత్రాన్ని తయారు చేశారు.రవాణా చేయడమూ సులభంగా ఉంటుందని చెప్పారు. దీనిని మరింత అభివృద్ధి చేస్తూనే మాన్యువల్‌ యంత్రాలు తయారు చేయడం కూడా తమ లక్ష్యంగా పెట్టుకున్నామని యువ ఇంజినీర్‌ అన్నారు. వీటిని తక్కువ ధరకే విక్రయిస్తామనీ, ఎక్కువ యంత్రాలు తయారు చేసి విస్తృతంగా మార్కెట్‌ చేస్తామని తెలిపారు.