
నవతెలంగాణ-రుద్రంగి
నేరాల నియంత్రణనే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుంది అని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం అని వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి అన్నారు.శుక్రవారం రుద్రంగి మండలంలోని వడ్డెర కాలనిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి సరైన పత్రాలు చూపించి తీసుకవేళ్ళవచ్చు అన్నారు.గొళ్ళెం రెడ్డి ఇంట్లో తనిఖీ చేయగా జంతువులను వేటాడాటానికి ఏర్పాటు చేసుకున్న వల స్వాధీనం చేసుకొని గొళ్ళెం రెడ్డిని బైండోవర్ చేశారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…పోలీసులు ఉన్నది ప్రజల రక్షణకే అని,ప్రజలకు పోలీసులు భద్రత, భరోసా కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు.గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తు లు అనుమానాస్పదంగా కనిపిస్తే, పోలీసులకు లేదా డయల్100 కి సమాచారం అందించాలని కోరారు.చట్ట వ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడ కూడదని,యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.గ్రామాల్లో కి గంజాయి మూలాలు రాకుండా చూసుకోవల సిన బాధ్యత గ్రామ ప్రజలాదే అని అలాంటి సమాచారం ఉంటే పోలీస్ వారికి సమాచారం అందించాలన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అన్నారు.గ్రామాల్లో అటవీ జంతువులను వేటాడిన అటవీ జంతువుల కోసం విద్యుత్ తీగలు అమార్చన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, హెచ్చరించారు.గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలు అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని అన్నారు.అదేవిధంగామొబైల్ ఫోన్ పోయిన చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ లో పిర్యాదు చేయండి.పోగొట్టుకున్న ఫోన్ ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల నుండి ఉపాధి కోసం వెళ్లే వారు నకిలీ గల్ఫ్ ఏజెంట్లును నమ్మి మోస పోవద్దని నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు సంబంధించిన సమాచారం ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అధికారి ఫోన్ నెంబర్ 8712656411 ను సంప్రదిస్తే ఏజెంట్లకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేయడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐ లు రాజేష్,మారుతి,అశోక్,పాల్గొన్నా రు