
మండలంలోని దాస్ నగర్ సమీపంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థిని గుర్రపు రోజా యూత్ ఫెస్ట్ లో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు. కళాశాల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ ఫెస్ట్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా నెక్లెస్ రోడ్ హైదరాబాదు రాష్ట్ర స్థాయి లో ఏర్పాటుచేసిన 5కే రెడ్ రన్ లో నిజామాబాద్ జిల్లా లోని మాక్లూర్ మండలం దాస్ నగర్ సమీపంలో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజ్ విద్యార్థి గుర్రపు రోజా కు ద్వితీయ స్థానం రావడం సాధించారు. అందుకు గాను రూ. 25 వేలు నగదు తో పాటు మేమొంటో, సర్టిఫికేట్ డిఏంఇ డా. రమేష్ రెడ్డి, టివివిపి కమిషనర్ డా. అజయ్ కుమార్, టి ఎస్ ఏ సీస్ ఐఎఎస్ హైమవతి చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని సిహెచ్ సుధాకర్ డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ ఎయిడ్స్ కంట్రోల్ తెలిపారు. పోటీలో గెలిచినటువంటి గుర్రపు రోజాను తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కే. రవీందర్ రెడ్డి, ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె లావణ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ఎం సరిత హర్షం వ్యక్తం చేశారు.