
రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో నీలం లక్ష్మి, కుర్మే మల్లన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో మాజీ మంత్రి టీపీసీసీ కోశాధికారి పి సుదర్శన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తాహెర్ బిన్ అందన్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి దొడ్ల రవీందర్ రెడ్డి, జిల్లా పిసిసి అంతిరెడ్డి రాజిరెడ్డి, గడుగు గంగాధర్, సాయిరెడ్డి, కార్తిక యాదవ్, చీరడి రవి, ఎల్ కృష్ణ, సిద్ధ సాయిలు, గంగాధర్, గైనీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.