తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని జుక్కల్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో భారిగా చోరికి పాల్పడ్డ సంఘటన అలస్యంగా చోటుచేసుకుంది. కుటింబికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్ మండల కేంద్రానికి చెందిన సుభాష్ కుమారుడు బొల్లివార్ సంజు బొంబాయిలో వలస వెళ్లి పనులు చేసుకుంటున్నాడు. తండ్రి  సుభాష్ కొంత కాలం క్రితం మరణించడం జర్గింది. సంజీవ్ తల్లి శివలక్ష్మి నాలుగు క్రితం కొడుకు దగ్గరికి వెళ్లి మంగళ వారం నాడు తిరిగి స్వగ్రామం జుక్కల్ ఇంటికి వచ్చింది. తలుపు తీసు చూడగా చోరి జర్గినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇంట్లో ఉన్న రూపాయలు 50వేలు, కిలో వెండి చోరికి గురైందని లక్ష్మి తెలిపారు. క్లూస్ టీం వచ్చి పరీశీలించడం జర్గింది. తాళం వెసింది వెసినట్టు ఉండి చోరి జర్గడం పోలీసులు ఆరాతీస్తున్నారు. కేసు నమేాదు చేసి దర్యాప్త చేస్తున్నారు.