
మండల కేంద్రంలో శనివారం నిర్వహించనున్న హత్ సే హత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అంకం కృష్ణారావు శనివారం రాజంపేట మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశం పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు గడపగడపకు మహమ్మద్ షబ్బీర్ అలీ పర్యటన ఉంటుందని అనంతరం చౌరస్తాలో పబ్లిక్ మీటింగ్ ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరు కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వీరన్న, బాలకృష్ణ అక్బర్,పట్టణ అధ్యక్షులు రంగ గంగాధర్ గౌడ్,పట్టణ యువజన అధ్యక్షులు షాదుల్, రైతు విభాగం మండల అధ్యక్షులు జూకంటి సుధాకర్ రెడ్డి, మండల మైనారిటీ అధ్యక్షులు అప్సర అలీ, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు షేక్ జమీల్,గ్రామ కార్యదర్శి వాజిత్ సల్మాన్, అఫ్రోజ్, స్వామి,నారాయణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.