
జాతీయ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నటరాజన్, రాష్ట్ర అధ్యక్షులు సిద్దేశ్వర్ ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన మోత్కూరి నవీన్ గౌడ్ ను కరీంనగర్, సిద్దిపేట్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ లకు జోనల్ కోఆర్డినేటర్ గా నియామించారు.కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గ ఇంచార్జీ, డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికేల నర్సారెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాట్ పల్లి నగేష్ రెడ్డి,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, కిసాన్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి , నిజామాబాద్ రూరల్లోని అన్ని మండలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల సమక్షంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఈ నియామక పత్రాన్ని అందజేశారు.