ఎం.ఆర్.ఒ ను సన్మానించిన ఆలయ కమిటీ డైరెక్టర్

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్‌ మండల నూతన తాసిల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన శివ ప్రసాద్ ను శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ డైరెక్టర్, కంచర్ల గ్రామ మాజీ సర్పంచ్ చంద్రం శాలువాతో ఘనంగా సన్మానించారు. రెవెన్యూ అధికారులకు ప్రజాప్రతిథులు సహకరించాలని తాసిల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనార్దన్ రెడ్డి, శ్రావణ్ గౌడ్, శంకర్ గౌడ్, బాబు, ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.