
మండలంలోని ముల్లంగి(బి), మాక్లూర్ గ్రామాలకు గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొర్రెలను లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ పంపిణీ చేయడంతో గొర్రె, మేకల సహకార సంఘం అధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితక్క చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా గొరెమేకల సహకార సంఘం మండల అధ్యక్షులు బురోల్ల అశోక్ మాట్లాడుతూ గొర్రెలను గొనుగొలు చేయడానికి లబ్ధిదారులను అమ్మకం దారుల వద్దకు నేరుగా తీసుక వెళ్లి నచ్చిన గొర్రెలను తీసుకునేలా రాష్ట్ర సిఎం కేసీఆర్ చర్యలను చేపట్టారన్నారు. అందులో భాగంగానే రెండవ విడుత పథకంలో మాక్లూర్ గ్రామానికి 5 యూనిట్లు, ముల్లంగి (బి) గ్రామానికి 6 యూనిట్లు వచ్చాయి. ఒక్కో యూనిట్ కు 20 గొర్రెలు, ఒక్క పొట్టేలు లబ్ధిదారులకు అందాయి. ఈ గొర్రెలను కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రాంతం నుంచి లబ్దిదారులు వెళ్లి తీసుక వచ్చారు. ఈ కార్యక్రమంలో గొర్రె, మేకల సహకార సంఘం మడల అధ్యక్షులు బురోళ్ళ అశోక్, స్థానిక సర్పంచ్ అశోక్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు దర్గాల సాయిలు, తెడ్డు శేఖర్, ఉరాడి సాయిలు, లబ్దిదారులు పాల్గొన్నారు.