రాజ్యాంగ పరిషత్‌కు అత్యధిక సభ్యులను పంపిన సంస్థానం?

Which institution has sent maximum number of members to the Constituent Assembly?1. 1928లో మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాజ్యాంగ రూపకల్పన ఉపసంఘంలోని కేవలం సభ్యుల సంఖ్య?
1.11 2. 12 3.9 4. 10
2. రాజ్యాంగ పరిషత్‌ను డిమాండ్‌ చేసిన తొలి రాజకీయ పార్టీ?
1.ఐ.ఎన్‌.సి 2. స్వరాజ్‌ పార్టీ
3. ముస్లిం లీగ్‌ పార్టీ 4. ఇండిపెండెంట్‌ లేబట్‌ పార్టీ
3. రాజ్యాంగ పరిషత్‌లోని ప్రారంభ సభ్యుల సంఖ్య?
1. 389 2. 292 3. 365 4. 392
4. స్వదేశీ సంస్థానాల నుండి తన ప్రతినిధిని పంపని అతి పెద్ద సంస్థానం?
1. జమ్మూ Ê కాశ్మీర్‌ 2. హైదరాబాదు 3. జూనాఘడ్‌ 4. మైసూర్‌
5. ఈ కింది వాటిని జతపరచండి.
1. రాజ్యాంగ పరిషత్‌లోని మొత్తం మహిళలు ( ) ఎ.7
2.రాజ్యాంగ రూపకల్పన ఉపసంఘ సభ్యులు ( ) బి.9
3. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు ( ) సి. 15
4. రాజ్యాంగ పరిషత్‌లోని విషయ నిర్ణయక ( ) డి. 12
కమిటీలు
1. 1ఎ,2బి,3సి,4డి 2. 1సి,2బి,3ఎ,4డి
3. 1బి,2డి,3ఎ,4సి 4. 1డి,2సి,3బి,4ఎ
6. రాజ్యాంగ పరిషత్‌కు అత్యధిక సభ్యులను పంపిన రాష్ట్రం?
1. మద్రాసు 2. యునైటెడ్‌ ప్రావిన్స్‌ 3. మహారాష్ట్ర 4. కలకత్తా
7. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కాని వ్యక్తి.
1. కె.యం.మున్షి 2. బి.ఎల్‌.మిట్టల్‌
3. టి.టి.కృష్ణమాచారి 4. బి.ఎన్‌.రావు
8. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి.
1. మొదటి భారతీయ మహిళా ఐఎన్‌సి అధ్యక్షురాలు సరోజినినాయుడు.
2. ముసాయిదా రాజ్యాంగం నందు 315 ఆర్టికల్స్‌, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి.
3. రాజ్యాంగ పరిషత్‌ కమిటీలలో అతి ప్రధానమైన కమిటీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ.
4. చిత్త రాజ్యాంగ నిర్మాత అని బెనగల నరసింహారావును అంటారు.
1. 4 మాత్రమే 2. 3,4 3. 2,3,4 4. పైవన్ని సరైనవే.
9. ఏ సం.లో చేయబడిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయోపరిమితిని 18సం.లకు తగ్గించిరి.
1. 1989 2. 1974 3. 1988 4. 1986
10. క్రింది వాటిలో సరికాని వాక్యంను గుర్తించండి.
1. అంబేద్కర్‌ను నైపుణ్యం ఉన్న పైలెట్‌గా బాబు రాజేంద్రప్రసాద్‌ అభివర్ణించారు.
2. బి.ఎన్‌.రావును ఆర్కిటెక్ట్‌ అని అనంతశయనం అయ్యంగర్‌ పేర్కొన్నారు.
3. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని ఐవర్‌ జెన్నింగ్‌ పేర్కొన్నారు.
4. ఎర్నేస్ట్‌ బార్కర్‌ అనే రాజనీతి శాస్త్రవేత్త రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంనకు కీ నోట్‌ లాంటిది అని పేర్కొన్నారు.
1. 2 మాత్రమే 2. అన్నీ 3. 2,4 4. 2,3
11. ఈకింది వాటిని జతపరచండి.
1. రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు ఎ.జె.బి.కృపలాని
2. ప్రాథమిక హక్కుల ఉపసంఘం అధ్యక్షుడు బి.జి.వి.మౌలాంకర్‌
3. రాజ్యాంగ సారధ్య సంఘం అధ్యక్షులు సి. జె.నెహ్రూ
4. రాజ్యాంగ పరిషత్‌ విధుల కమిటీ డి. డా.బాబు రాజేంద్ర ప్రసాద్‌
1. 1సి,2ఎ,3డి,4బి 2. 1సి,2ఎ,3బి,4డి
3. 1ఎ,2బి,3సి,4డి 4. 1సి,2బి,3ఎ,4బి
12. రాజ్యాంగ రచనకు అత్యధిక కాలం తీసుకున్న దేశం?
1. ఫ్రెంచ్‌ 2. ఆస్ట్రేలియా 3. ఇండియా 4. డెన్మార్క్‌
13. భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం.
1.2 సం.11 నెలల 18 రోజులు 2. 2 సం.12 నెలల 18 రోజులు
3. 3 సం.10 నెలల 10 రోజులు 4. 3 సం.11 నెలల 18 రోజులు
14. రాజ్యాంగ పరిషత్‌ ఆవశ్యకతను తెలియ చేసిన మొదటి వ్యక్తి.
1. యం.కె. గాంధీ 2. సుభాష్‌చంద్రబోస్‌ 3. యం.ఎన్‌.రారు 4. అనిబిసెంట్‌
15. ఈ కింది వాటిని జతపరచండి.
1. క్యాబినేట్‌ మిషన్‌ సిఫారసు ( ) ఎ.1946
2. వేవెల్‌ ప్రణాళిక ( ) బి.1945
3. క్రిప్స్‌ మిషన్‌ ( ) సి.1942
4. ఆగస్ట్‌ ప్రతిపాదన ( ) డి.1940
1. 1ఎ,2బి,3సి,4డి 2. 1బి,2సి,3డి,4ఎ 3. 1సి,2డి,3ఎ,4బి 4. 1డి,2ఎ,3బి,4సి
16. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1. రాజ్యాంగ పరిషత్‌లోని చీఫ్‌ కమీషనరేట్‌ ప్రాంతాలు ఢిల్లీ, అజ్మీర్‌, మేవార్‌, కూర్గ్‌.
2.అత్యధిక సభ్యులను రాజ్యాంగ పరిషత్‌కు పంపిన సంస్థానం మైసూర్‌.
3. చీఫ్‌ కమీషనరేట్‌ ప్రాంతాల సభ్యులు నామినేట్‌ చేయబడ్డారు.
4. రాజ్యాంగ పరిషత్‌కు తక్కువ సభ్యులను పంపిన రాష్ట్రం – అస్సాం.
1. 1,3 2. 1,2,3 3. 1,3,4 4. అన్ని సరైనవే.
17. రాజ్యాంగ పరిషత్‌లో అతి పెద్ద కమిటీ.
1.రాజ్యాంగ సలహా సంఘం 2. కేంద్ర అధికారాల కమిటీ
3. రాష్ట్రాల కమిటీ 4. రాజ్యాంగ ముసాయిదా కమిటీ
18. రాజ్యాంగ పరిషత్‌లో వివిధ వర్గాలు, వారి ప్రతినిధులు జతపరచండి.
1. క్రైస్తవులు ( ) ఎ.శ్యాంప్రసాద్‌ ముఖర్జీ
2. ఆంగ్లో ఇండియన్స్‌ ( ) బి.డా.బి.ఆర్‌.అంబేద్కర్‌
3. హిందువులు ( ) సి.హెచ్‌.సి.ముఖర్జీ
4. షెడ్యూల్డ్‌ కులాలు ( ) డి. ప్రాంక్‌ ఆంటోని
5. మహిళలు ( ) ఇ. హన్సా మెహతా
1. 1సి,2డి,3ఎ,4బి,5ఇ 2. 1సి,2బి,3డి,4ఎ,5ఇ
3. 1సి,2బి,3ఎ,4ఆ,5ఇ 4. 1సి,2బి,3ఇ,4ఎ,5డి
19. ఎన్నికలలో పోటీ చేయకుండా రాజ్యాంగ పరిషత్‌కు నామినేట్‌ అయిన వ్యక్తులు.
1. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 2. హెచ్‌.వి. కామత్‌
3. డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ 4. గోపాలస్వామి అయ్యంగార్‌
1. 1,2,3 2. 2,3 3. 4 మాత్రమే 4. 1,2,4
20. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ. రాజ్యాంగ పరిషత్‌కు నామినేట్‌ చేయబడిన వారు 15.
బి. రాజ్యాంగ పరిషత్‌కు సభ్యురాలిగా పని చేసిన ఏకైక ముస్లిం మహిళ – ఎయిజాజ్‌ రసూల్‌ బేగం.
సి.రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికయిన తెలుగు ప్రముఖులు -9.
డి. దేశ విభజన కారణంగా రాజ్యాంగ పరిషత్‌ సభ్యత్వం కోల్పోయిన ఏకైక కమ్యూనిస్ట్‌ వ్యక్తి – సోమనాథ్‌ లహరి.
1.ఎ,బి 2. బి మాత్రమే 3. బి,డి 4. పై అన్నీ సరైనవే.
21. ఎ.రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం 9-12-1946.
బి. రాజ్యాంగ పరిషత్‌ శాశ్వత అధ్యక్షుడిగా డా.బాబు రాజేంద్రప్రసాద్‌ ఎన్నికను జె.బి.కృపలాని ప్రతిపాదించారు.
1.ఎ సరైనది బి తప్పు. 2. ఎ తప్పు, బి సరైనది 3.రెండు సరైనవే. 4. రెండు తప్పు.
22. చారిత్రక లక్ష్యాలు ఆశయాలు తీర్మానం జవహర్‌లాల్‌నెహ్రూ ఎప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టిరి.
1. 11.12.1946 2. 13.12.1946 3. 15.12.1946 4. 12.12.1946
23. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికయిన కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య.
1. 202 (తర్వాత 208) 2. 229 3. 211 4. 389
24. రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌ రాసిన జనగణమన అను జాతీయ గీతమును ఏ ఐఎన్‌సి సమావేశం ఆమోదించింది?
1. 1896 – కలకత్తా 2. 1907 – సూరత్‌
3. 1911 – కలకత్తా 4. 1909 – లాహోర్‌
25. ఈ కింది వాటిని జతపరుచుము.
1. ఐఎన్‌సి ఎ. 73
2. ముస్లిం లీగ్‌ బి. 7
3. స్వతంత్రులు సి. 202
4. యునియనిస్ట్‌ మహమ్మదీయులు డి. 1
5. క్రిస్టియన్లు ఇ. 2
6. షెడ్యూల్డ్‌ జాతి ఫెడరేషన్‌ ఎఫ్‌.3
1. 1సి,2ఎ,3ఇ,4ఎఫ్‌,5బి,6డి
2. 1సి,2ఎ,3బి,4ఎఫ్‌,5ఇ,6డి
3. 1సి,2బి,3ఎ,4ఇ,5డి,6ఎఫ్‌
4. 1ఎ,2బి,3సి,4డి,5ఇ,6ఎఫ్‌

సమాధానాలు
1.3 2.2 3.1 4.2 5.2 6.2 7.4 8.4 9.3 10.1 11.1 12.2 13.1 14.3 15.1 16.4 17.1 18.1 19.4 20.4 21.3 22.2 23.1 24.3 25.
డాక్టర్‌ అలీ సార్‌
భారత రాజ్యాంగ నిపుణులు
9494228002